ఇండోనేషియా ఫెర్రీ యాక్సిడెంట్: 243మందితో వెళ్తుండగా ప్రమాదం, 102మంది సురక్షితం..

ఇండోనేషియా, నౌక, ప్రమాదం, జావా

ఫొటో సోర్స్, Getty Images

ప్రచురణ
చదివే సమయం: 2 నిమిషాలు

జావా సముద్రంలో ఇండోనేషియా ప్రయాణికుల నౌక ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందారని 102మందిని రక్షించారని ఓ అధికారి చెప్పారు.

243 మంది ప్రయాణికులతో ఉన్న విర్గో ట్రాన్స్‌పోర్ట్ 8 నౌకతో సంబంధాలు తెగిపోవడంతో రెస్క్యూ ఆపరేషన్ మొదలయింది.

ఈ నౌక ప్రతికూల వాతావరణంలో చిక్కుకుపోయిందని ఇండోనేషియా సెర్చ్ అండ్ రెస్క్యూ ఏజెన్సీ తెలిపింది.

గల్లంతయిన ప్రయాణికుల కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది.

గల్లంతయిన 140మంది కోసం గాలింపు కొనసాగుతోందని రాయిటర్స్ తెలిపింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

సురబయా నుంచి బంజర్‌మసిన్‌కు వెళ్తున్న నౌక

సురబయా నుంచి దక్షిణ కాలిమంతన్‌లోని బంజర్‌మసిన్ నగరానికి ఫెర్రీ ప్రయాణిస్తోంది. ఆదివారం అర్ధరాత్రి దాదాపు రెండుగంటల సమయంలో దక్షిణ బంజర్‌మిసన్‌కు సుమారు 150కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడు నౌకతో సంబంధాలు తెగిపోయాయి.

గాలింపు, సహాయక నౌకలను హెలికాప్టర్లను సెర్చ్ ఆపరేషన్ కోసం రంగంలోకిదించారు. జావా సముద్రంలో ఆ ప్రాంతంలో ఉన్న నౌకలన్నింటినీ అప్రమత్తం చేశారు. ప్రయాణికుల ఆచూకీ లభిస్తే సమాచారమందించాలని కోరారు.

గత నెలలో ఇండోనేషియాలోని మదుర ద్వీపం సమీపంలోని ఓ ఫెర్రీలో మంటలు చెలరేగి ఐదుగురు చనిపోయారు.

ఇండోనేషియాలో 17వేలకు పైగా ద్వీపాలున్నాయి. అక్కడ ప్రయాణికుల రాకపోకలకు ఫెర్రీలు ఎక్కువగా ఉపయోగిస్తుంటారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)