BBC News, తెలుగు - హోమ్
ముఖ్యమైన కథనాలు
ఇస్రో ప్రైవేటీకరణకు కేంద్రం ప్రయత్నిస్తోందా? ఉద్యోగ సంఘాలు ఏమంటున్నాయి?
ప్రస్తుతం భారత్‌లో ఉన్న స్పేస్ టెక్నాలజీకి చెందిన 18 స్టార్టప్‌లతో పాటు 52 ప్రభుత్వేతర సంస్థలకు కలిపి అంతరిక్ష రంగ కార్యకలాపాలు నిర్వహించేందుకు 113 ఆథరైజేషన్స్ దక్కాయి.
‘ఆమె కడుపులో 13 పెన్నులు, 5 చెంచాలు, ఒక కొవ్వొత్తి...’ బయటకు తీసిన డాక్టర్ ఏం చెప్పారంటే
నరసరావుపేటకు చెందిన ఓ 33 ఏళ్ల వివాహితకు ఎడమ వైపు తీవ్రమైన ఛాతీ నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆమెను నరసరావుపేటలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారు. వైద్యులు ఆమెకు ఈసీజీ, ఎండోస్కోపీ నిర్వహించి కడుపులో అనేక వస్తువులు ఉన్నట్లు గుర్తించారు.
యూట్యూబర్ ‘నందు’కు నోటీసులు.. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో అడ్డుకున్న ఇమ్మిగ్రేషన్ అధికారులు
చీటింగ్ కేసుకు సంబంధించి ప్రముఖ యూట్యూబర్, నందుస్ వరల్డ్ చానెల్ నిర్వాహరాలు నందనకు సోమవారం నోటీసులు జారీ చేసినట్లు బీబీసీకి ఇబ్రహీంపట్నం సీఐ సుబ్రహ్మణ్యం తెలిపారు.
పదమూడేళ్లుగా హార్ట్ సర్జరీ కోసం ఎదురుచూపులు.. దిల్లీ ఎయిమ్స్‌లో మృతి చెందిన తన్వీ తల్లిదండ్రులు ఏమంటున్నారు
''ఆపరేషన్ పేరుతో రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచిపోయాయి. కానీ, నా బిడ్డకు ఆపరేషన్ జరగలేదు. ఆగస్టు 31న రాత్రి 3:30 గంటలకు నా కళ్ల ముందే నా బిడ్డ ప్రాణాలు విడిచింది'' అని తన్వీ తండ్రి తెలిపారు. తన్వీ మృతిపై ఎయిమ్స్ అధికారులు విచారణ కమిటీ వేశారు.
వీడియో, హరీశ్ రావు: అసెంబ్లీ ఎదుట బనియన్‌తో నిరసన, వ్యవధి 1,01
బ్లాక్ టీ షర్టు విప్పి..బనియన్‌తో అసెంబ్లీ ముందట బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు నిరసన తెలిపారు. తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నల్ల టీషర్టులతో అసెంబ్లీ దగ్గరికి వచ్చారు.
మెడనొప్పి వస్తోందా? ‘అవయవాలు మొద్దుబారక ముందే జాగ్రత్త పడండి’
స్మార్ట్‌ఫోన్ ఎక్కువగా వాడుతున్నారా? గంటల తరబడి రీల్స్ చూస్తున్నారా? అయితే జాగ్రత్త. మితిమీరిన సెల్‌ఫోన్ వాడకం వల్ల మెడనొప్పి, వెన్నునొప్పే కాదు.. చేతులు, కాళ్లు పనిచేయకుండా పోయే ప్రమాదం ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. స్క్రీన్ టైమ్ పెరిగితే వచ్చే అనర్థాలు, నివారణా మార్గాలపై డాక్టర్ విశ్వనాథన్ సూచనలు ఏంటంటే..
'నాకు ఎండోమెట్రియాసిస్ ఉందని 13 ఏళ్ల వయసులో గుర్తించే వరకు నొప్పి వచ్చిన ప్రతిసారీ డాక్టర్లు మార్ఫిన్ ఇచ్చేవారు'
గ్రేస్‌కు 11 ఏళ్ల వయసులో నెలసరి ప్రారంభమైంది. 13 ఏళ్లు వచ్చేసరికి పీరియడ్స్ సమయంలో భరించలేని నొప్పితో బాధపడటం మొదలైంది. ఆ నొప్పి ఎలా ఉంటుందో వివరిస్తూ "నా పొట్టలో ఎవరో వేడివేడి ముళ్ల తీగను గట్టిగా చుట్టేసినట్లు" అనిపిస్తుందని చెప్పారు. "నా లోపలి అవయవాలన్నీ ముక్కలైపోతున్నట్లు ఉంటుంది" అని ఆమె అన్నారు. ఆమె తరచూ మంచానికే పరిమితం కావాల్సి వచ్చేది.
కొత్త ప్రపంచ పటానికి అనుకూలంగా ఐక్యరాజ్య సమితిలో ఓటేసిన భారత్ ఇప్పుడెందుకు అభ్యంతరం చెబుతోంది?
అమెరికా మినహా 164 దేశాలు కొత్త ప్రపంచ పటానికి సంబంధించిన తీర్మానాన్ని ఆమోదించాయి. ఫ్రాన్స్, బ్రిటన్, ఇండియా కూడా ఈ తీర్మానాన్ని ఆమోదించిన దేశాల్లో ఉన్నాయి. కానీ కొత్త మ్యాప్‌లలో భారత్‌కు అభ్యంతరం ఎక్కడంటే...
రన్‌వేపై అదుపు తప్పి క్రాష్ అయిన విమానం, ఐదుగురు మృతి.. ప్రమాద ఘటన 7 ఫోటోలలో...
ప్రమాదం కారణంగా అనేక విమాన సర్వీసులు రద్దవడంతో ప్రయాణికులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అధికారుల నుంచి తమకు సరైన సమాచారం లేదని వాపోయారు.
బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్‌లో
ఫీచర్లు
ఆరుతరాల అరుదైన ఉమ్మడి కుటుంబం: రోజుకు బస్తా బియ్యం, పండగొస్తే 2 పొట్టేళ్లు, 20 కేజీల చికెన్.. కలిసిమెలిసి ఎలా జీవనం సాగిస్తున్నారంటే..
అనంతపురం జిల్లాలో 83 మంది ఒకే ఇంట్లో కలిసిమెలిసి జీవిస్తున్న అరుదైన ఉమ్మడి కుటుంబం కథ ఇది. రోజుకు 50 కేజీల బియ్యం వంట, ఆదివారం వస్తే పొట్టేలు కోయాల్సిందే, సరదాగా బజ్జీలు తినాలంటే 15 కేజీల పిండి సిద్ధం చేయాల్సిందే. ఆధునిక కాలంలో ఎలాంటి విభేదాలు లేకుండా వీరంతా ఎలా కలిసి ఉంటున్నారు? ఆ కుటుంబ సభ్యులు ఏం చెబుతున్నారంటే..
గదర్ పార్టీ: భారత స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న ఈ గ్రూప్‌కు, ఇరాన్‌కు ఉన్న అనుబంధం ఏంటి?
"చాలామంది స్వాతంత్ర్య సమరయోధులు తమ భద్రత కోసం ఇరాన్‌కు వెళ్లి అక్కడి నుంచే పోరాటాన్ని కొనసాగించేవారు. షిరాజ్‌లో జరిగిన ఒక ఎన్కౌంటర్ తర్వాత అంబా ప్రసాద్ తన ఎడమ చేతితోనే రివాల్వర్‌ను పట్టుకుని తనపై దాడి చేసిన వారిని ఎదుర్కొన్నారు’’
తాజ్‌మహల్: ప్రేమకు చిహ్నమా, ముంతాజ్ లాంటి మహిళల ప్రాణ త్యాగాలకు చిహ్నమా?
షాజహాన్ ప్రేమకు ప్రతీకగా దీన్ని నిర్మించినప్పటికీ, మాతృ ఆరోగ్య సంరక్షణకు ప్రతీక అయితే ఇంకా బాగుండేదని మద్రాస్ కొరియర్ పత్రిక రాసింది.
సముద్ర గుప్తుడు: 'ఒళ్లంతా బల్లెం, బాణం, ఈటె, కత్తి, గద, గొడ్డలి గాయాలున్న ఈ రాజు ఒక్క యుద్ధం కూడా ఓడిపోలేదు'
‘ఉత్తర భారతంలో తొమ్మిది రాజ్యాలను జయించడానికి సముద్రగుప్తుడు ఎంతో దూరదృష్టితో ఆలోచించాడు. ఈ తొమ్మిదిమంది రాజుల పట్ల చాలా కఠినంగా వ్యవహరించాడు. సైనిక శక్తితో ఈ రాజ్యాలను జయించి, తన సామ్రాజ్యంలో విలీనం చేసుకున్నాడు. కానీ, దక్షిణాదిన తాను జయించిన 12 రాజ్యాలను మాత్రం విలీనం చేసుకునేందుకు ప్రయత్నించలేదు’
జనాభా లెక్కల కోసం ఒకప్పుడు పోస్టల్ స్టాంపులు, ఉత్తరాలు ప్రభుత్వానికి ఎలా సాయపడ్డాయంటే..
వంద కోట్లకు పైగా ఉన్న జనాభా, తమను తాము ఈ దేశ చరిత్రలో ఒక భాగంగా గుర్తించుకునేలా, ప్రభుత్వంపై అంతటి నమ్మకాన్ని ఉంచేలా వారిని ఒప్పించడమే ఆ సవాలు.
బీబీసీ ప్రపంచం
రంగులద్దని వార్తలు-రాజీలేని రిపోర్టింగ్‌తో అంతర్జాతీయ, జాతీయ విశేషాలను తెలుగు వారి చెంతకు తీసుకువస్తుంది బీబీసి ప్రపంచం.























































