కేజ్రీవాల్‌ను మార్చి 28 వరకు ఈడీ కస్టడీకి అనుమతించిన కోర్టు

దిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్టయిన ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను మార్చి 28వ తేదీ వరకు ఈడీ కస్టడీకి కోర్టు అనుమతిచ్చింది.

లైవ్ కవరేజీ

  1. ‘నర్సాపురం-యానాం మధ్య తీరాన్ని తాకిన అర్నబ్ తుపాను’

    అర్నబ్ తీవ్ర తుపాను తీరాన్ని తాకింది
    ఫొటో క్యాప్షన్, అర్నబ్ తీవ్ర తుపాను తీరాన్ని తాకింది

    ఈ తీవ్ర తుపాను నర్సాపురం, యానాం మధ్య ప్రాంతంలో తీరాన్ని తాకినట్టు మూర్తి ఏఎన్ఐకి చెప్పారు.

    అర్నబ్ తుపాను పూర్తిగా తీరం దాటేందుకు మరో రెండు మూడు గంటల సమయం పడుతుందని ఆయన పేర్కొన్నారు.

    "ప్రస్తుతం ఈ తీవ్ర తుపాను నర్సాపురం, యానాం మధ్య తీర ప్రాంతంలో ఉంది. ఇది గంటకు మూడు కిలోమీటర్ల అతి తక్కువ వేగంతో కదులుతోంది. తుపాను కేంద్రం ఇప్పటికే తీరాన్ని తాకింది. పూర్తిగా తీరం దాటడానికి ఒకటి నుంచి రెండు గంటలు, లేదా రెండు నుంచి మూడు గంటల సమయం పట్టవచ్చు. తీరం దాటిన తర్వాత, ఈ తుపాను ఉత్తర-వాయవ్య దిశగా పయనించే అవకాశం ఉంది. తీరం దాటే సమయంలో గంటకు 125 నుంచి 135 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి, ఇవి గంటకు 140 కిలోమీటర్ల వేగం వరకు కూడా ఉండవచ్చు. తీరం దాటిన తర్వాత ఈ గాలుల తీవ్రత క్రమంగా తగ్గుతుంది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాల తీవ్రత ఈ సాయంత్రం వరకు కొనసాగుతుంది; సాయంత్రం నుంచి వర్షాల తీవ్రత నెమ్మదిగా తగ్గుముఖం పడుతుంది, అదే సమయంలో గాలుల వేగం కూడా క్రమంగా తగ్గుతుంది" అని తెలిపారు.

  2. అర్నబ్ తుపాను తీవ్రతను చూపే 11 ఫోటోలు

  3. ’24 గంటల్లో విద్యుత్ పునరుద్ధరణ, తెలంగాణ సాయం కోరాం ’ బీబీసీతో ఏపీ విద్యుత్‌శాఖా మంత్రి గొట్టిపాటి

    ఆంధ్రప్రదేశ్ విద్యుత్‌శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్
    ఫొటో క్యాప్షన్, వర్షాలు తగ్గిన 24 గంటల్లోనే విద్యుత్‌ను పునరుద్ధరిస్తామన్న మంత్రి గొట్టిపాటి రవికుమార్

    అర్నబ్ తుపాను ప్రభావం తగ్గిన 24 గంటల్లోనే అన్ని ప్రాంతాల్లో విద్యుత్‌ను పునరుద్ధరిస్తామని ఏపీ విద్యుత్ శాఖా మంత్రి గొట్టిపాటి రవి కుమార్ బీబీసీకి ఫోన్ ద్వారా తెలిపారు.

    తుపాను ప్రభావం ప్రస్తుతానికి ఏపీసీపీడీసీఎల్‌పై ఎక్కువ ప్రభావం చూపుతున్నందున తెలంగాణ సాయం కోరినట్టు మంత్రి తెలిపారు. విద్యుత్ పునరుద్ధరణకు అవసరమైన సామాగ్రి, మానవ వనరులు అందించాలని తెలంగాణ విద్యుత్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్‌తో మాట్లాడామన్నారు. అవసరమైతే ఆ శాఖ మంత్రితో కూడా చర్చిస్తామని గొట్టిపాటి పేర్కొన్నారు.

    ఇలాంటి సమయంలో పొరుగుల రాష్ట్రాలతో సమన్వయం చేసుకొని ముందుకు సాగడం తమ విధానంలో భాగమని మంత్రి తెలిపారు. గతంలో తమిళనాడు సహాయం తీసుకున్నామని, ఇప్పుడు తెలంగాణ హెల్ప్ కోరామని వివరించారు.

    ముందు జాగ్రత్తగా తుపాను ప్రభావిత ప్రాంతాలకు 15000లకుపైగా విద్యుత్ స్తంభాలు, ఇతర సామాగ్రిని తరలించామని మంత్రి తెలిపారు. తుపాను ప్రభావం శ్రీకాకుళం జిల్లా మొదలు కొని, కృష్ణా జిల్లా వరకు ఉంటుందన్నారు. ప్రస్తుతానికి వర్షాలు తగ్గకపోవడంతో పనులకు ఆటంకం కలుగుతోందని చెప్పారు. అయినా సరే విశాఖలో విద్యుత్ పునరుద్ధరణ పనులు పూర్తి చేశామని, ఇప్పుడు అక్కడి సిబ్బందిని, సామాగ్రిని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నామని అన్నారు.

    దాదాపు నాలుగు వందల వరకు ఫీడర్స్‌లో విద్యుత్ సరఫరా నిలిపివేసినట్టు మంత్రి వెల్లడించారు. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ తీగలు తెగి సరఫరాకు అంతరాయం ఏర్పడితే మరికొన్ని చోట్ల ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు అధికారులే సప్లై నిలిపివేశారని పేర్కొన్నారు. వర్షాలు తగ్గుముఖ పట్టిన వెంటనే గంటల వ్యవధిలోనే పునరుద్ధరణ పనులు పూర్తి చేస్తామని, అంత వరకు ప్రజలు విద్యుత్ తీగలు పట్టుకోవడం, స్తంభాలను తాకడం చేయవద్దని సూచించారు.

  4. ‘మధ్యాహ్నానికి గాలుల వేగం తగ్గే అవకాశం’ : ఏపీ వాతావరణ శాఖ

    అర్నబ్ తుపాను ప్రస్తుతానికి ఒకే చోట నిలిచి ఉందని, ఒకట్రెండు గంటల్లో తీరందాటుతుందని ఆంధ్రప్రదేశ్ వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్నం చెప్పారు.
    ఫొటో క్యాప్షన్, అర్నబ్ తుపాను ప్రస్తుతానికి ఒకే చోట నిలిచి ఉందని, ఒకట్రెండు గంటల్లో తీరందాటుతుందని ఆంధ్రప్రదేశ్ వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్నం చెప్పారు.

    అర్నబ్ తుపాను ప్రస్తుతానికి ఒకే చోట నిలిచి ఉందని, ఒకట్రెండు గంటల్లో తీరం దాటుతుందని ఆంధ్రప్రదేశ్ వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్నం చెప్పారు. ఏఎన్ఐతో మాట్లాడిన ఆమె తుపాను తీరం దాటే సమయంలో 150 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయని చెప్పారు.

    "ప్రస్తుతం ఈ తుపాను తీవ్రతను గమనిస్తే, కోనసీమ, కాకినాడ పరిసర ప్రాంతాలతోపాటు ఇతర తీరప్రాంత జిల్లాల్లో గాలి వేగం గంటకు 125 నుంచి 135 కిలోమీటర్ల వరకు ఉంది. ఇది గంటకు 150 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం కూడా ఉంది. ప్రస్తుతం తుపాను దాదాపు ఒకే చోట నిలిచి ఉంది.ఒకటి రెండు గంటల్లో ఇది తీరాన్ని దాటే అవకాశం ఉంది. రాబోయే కొద్ది గంటల్లో ఈ తుపాను తీరాన్ని దాటుతుందని అంచనా. ఆ తర్వాత దీని తీవ్రత తగ్గి, 'తీవ్ర తుపాను'గా మారుతుంది.మధ్యాహ్నానికి ఇది మరింత బలహీనపడి కేవలం 'తుపాను'గా మారే అవకాశం ఉంది. తీరాన్ని దాటే సమయంలో ఇది 'అత్యంత తీవ్ర తుపాను' స్థితిలో ఉంటుంది. కొన్ని గంటల తర్వాత గాలి వేగం గంటకు 90 నుంచి 120 కిలోమీటర్ల వరకు ఉండవచ్చు. మధ్యాహ్నానికి గాలి వేగం మరింత తగ్గి, గంటకు 60 నుంచి 70 కిలోమీటర్లకు చేరుకుంటుందని అంచనా" అని నాగరత్నం తెలిపారు.

  5. అర్నబ్ తుపాను: ఇవాళ, రేపు, ఎల్లుండి పలు రైళ్లు రద్దు

    అర్నబ్ తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, ఒడిశా మీదుగా నడిచే పలు రైళ్లను రద్దు చేసింది దక్షిణ మధ్య రైల్వే
    ఫొటో క్యాప్షన్, అర్నబ్ తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, ఒడిశా మీదుగా నడిచే పలు రైళ్లను రద్దు చేసింది దక్షిణ మధ్య రైల్వే

    అర్నబ్ తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, ఒడిశా మీదుగా నడిచే పలు రైళ్లను రద్దు చేసింది దక్షిణ మధ్య రైల్వే దీనికి సంబంధించిన తాజా వివరాలతో ఒక ప్రకటన విడుదల చేసింది.

    దక్షిణ మధ్య రైల్వే ప్రకటించిన వివరాల ప్రకారం ఇవాళ రేపు రద్దు అయిన రైళ్ల వివరాలు ఇవే

    ఇవాళ రద్దు అయిన రైళ్లు (28 అక్టోబర్)

    • 12727 విశాఖపట్నం- సికింద్రాబాద్
    • 12739 విశాఖపట్నం- సికింద్రాబాద్
    • 17206 కాకినాడ పోర్టు- సాయినగర్ షిర్డీ
    • 12737 కాకినాడ పోర్టు – లింగంపల్లి
    • 20707 సికింద్రాబాద్- విశాఖపట్నం
    • 20708 విశాఖపట్నం- సికింద్రాబాద్
    • 20833 విశాఖపట్నం- సికింద్రాబాద్
    • 12787 నర్సాపురం- నాగర్‌సోల్
    • 17255 నర్సాపురం- లింగంపల్లి
    • 20834సికింద్రాబాద్- విశాఖపట్నం

    రేపు రద్దు అయిన రైళ్లు(29 అక్టోబర్)

    • 12703 హౌరా- సికింద్రాబాద్ ట్రైన్
    • 17015 భువనేశ్వర్ – సికింద్రాబాద్
    • 22881 పుణె- భువనేశ్వర్
    • 17205 సాయినగర్ షిర్డీ- కాకినాడ పోర్ట్

    శుక్రవారం రద్దు అయిన రైళ్లు(30 అక్టోబర్)

    • 20809 సంబల్‌పూర్- హెచ్ఎస్ నాందేడ్
    • రీ షెడ్యూల్ అయిన రైళ్లు(బయల్దేరాల్సిన సమయానికి కంటే మూడు గంటలు ఆలస్యంగా నడుస్తాయి)
    • 12805 విశాఖపట్నం- లింగంపల్లి
    • 17221 కాకినాడ పోర్టు – ఎల్టీటీ ముంబై
    • 12806 లింగంపల్లి- విశాఖపట్నం
    • 18046 చర్లపల్లి- షాలీమర్
    • 18519 విశాఖపట్నం- ముంబై ఎల్టీటీ (నిన్న బయల్దేరాల్సిన రైలు ఇవాళ ఉదయం నాలుగు గంటలకు రీ షెడ్యూల్ చేశారు)
  6. ఇజ్రాయెల్ ఎన్నికలు: ఎగ్జిట్ పోల్స్ ఏం చెబుతున్నాయి, నెతన్యాహు ఏమన్నారు?

  7. అర్నబ్ విధ్వంసం: నేలకొరిగిన చెట్లు, కూలిన వేలాది విద్యుత్ స్తంభాలు

    అర్నబ్ తుపాను, ఆంధ్రప్రదేశ్, విశాఖపట్నం, కాకినాడ, చంద్రబాబు నాయుడు.
    ఫొటో క్యాప్షన్, కూలిన విద్యుత్ స్తంభాలు, నేలకొరిగిన చెట్లు, రెండు రోజుల పాటు తుపాను ప్రభావం, సీఎంకి వివరించిన అధికారులు

    అర్నబ్ తుపానుకు సంబంధించిన తాజా సమాచారాన్ని ఆర్టీజీఎస్ అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. మరో రెండు రోజుపాటు దీని ప్రభావం ఉంటుందని తెలిపారు.

    ఇవాళ ఉదయం 6 గంటల తర్వాత తుపాను తీరం దాటుతోందని వేకువజామున అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఈ ప్రభావంతో ఇవాళ, రేపు భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని ఆర్టీజీఎస్ అధికారులు తెలిపారు.

    తుపాన్ ప్రభావంతో చాలా ప్రాంతాల్లో చెట్లు నేలకొరిగాయని, కొన్ని చోట్ల విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో ముందు జాగ్రత్తగా విద్యుత్ నిలిపేశామన్నారు.

    పడిపోయిన చెట్లను వెంటనే తొలగించాలని... తీవ్రత తగ్గాక విద్యుత్ పునరుద్దరణకు చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.

    చెరువులు, కాల్వలు పొంగి పొర్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని దిశా నిర్దేశం చేశారు. జిల్లాల వారీగా తాము చేపడుతున్న సహయక చర్యలను కలెక్టర్లు వివరించారు.

    కోనసీమ జిల్లాలో సుమారు 6వేల విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.

  8. 'నా పుస్తకం వెలువడితే, అదొక సంచలనం అవుతుంది': సోనియా గాంధీ

    రాజీవ్ గాంధీ ప్రధాన మంత్రి కావడం నాకు ఇష్టం లేదు- సోనియా గాంధీ
    ఫొటో క్యాప్షన్, రాజీవ్ గాంధీ ప్రధాన మంత్రి కావడం నాకు ఇష్టం లేదు- సోనియా గాంధీ

    కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్, మాజీ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, తన రాబోయే ఆత్మకథ 'బిలాంగింగ్ – ఎ జర్నీ ఆఫ్ లవ్' గురించి ఒక వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో పంచుకున్నారు.

    రాజీవ్ గాంధీని దేశ ప్రధానిని చేస్తున్నప్పుడు తాను ఆ నిర్ణయాన్ని పూర్తిగా వ్యతిరేకించానని, రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి కావడం తనకు అసలు ఇష్టం లేదని ఆ వీడియోలో ఆమె చెప్పారు.

    వచ్చే నెల నవంబర్ 10న విడుదల కానున్న తన పుస్తకం గురించి, తన జీవితంలోని పలు ముఖ్యమైన ఘట్టాల గురించి ఆమె ఈ వీడియోలో సూటిగా మాట్లాడారు.

    "ఈ పుస్తకం బయటకు వచ్చినప్పుడు, కచ్చితంగా కొంత నాటకీయత చోటుచేసుకుంటుంది" అని తను పోస్ట్ చేసిన వీడియోకు క్యాప్షన్ పెట్టారు సోనియా గాంధీ.

    "దశాబ్దాలుగా ఇతరులు నా కథ చెబుతూ వచ్చారు, ఇప్పుడు నావంతు వచ్చింది, నేను పూర్తి కథ చెప్పాలా వద్దా అన్నది నాకు తెలియదు, కానీ నా గురించి చాలా రాశారు, అందులో చాలా వరకు నిజం కాదని నాకు అనిపించింది" అని ఆమె పేర్కొన్నారు.

    "చాలా విషయాలు కల్పించారు లేదా అతిశయోక్తి జోడించారు. అందుకే నా సొంత కథను రాసి, వాస్తవాలను, జరిగిన సంఘటనలను ఉన్నది ఉన్నట్లుగా చెప్పడానికి ఇదే సరైన సమయం అని నేను అనుకుంటున్నా" అని ఆమె చెప్పారు.

  9. అర్నబ్: కుండపోత వర్షాలు, ఆకస్మిక వరదలు - ఐఎండీ హెచ్చరిక

  10. భారత్ విడిచి వెళ్లాలంటూ ఇమ్రాన్ ఖాన్‌కు నోటీసుపై బాంబే హైకోర్టు తాజా స్పందనేంటి?

    ముంబైలోని ఫారెనర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్(ఎఫ్‌ఆర్‌ఆర్‌ఓ) అక్టోబర్ 14న ‘భారత్ విడిచి వెళ్లాలనే నోటీసు’ను ఇమ్రాన్ ఖాన్ జారీ చేసింది.
    ఫొటో క్యాప్షన్, నటుడు ఇమ్రాన్ ఖాన్ (ఫైల్ ఫోటో)

    ‘భారత్ విడిచి వెళ్లాలనే నోటీసు’ను సవాలు చేస్తూ ఇమ్రాన్ ఖాన్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను బాంబే హైకోర్టు నవంబర్ 2వ తేదీకి వాయిదా వేసింది.

    ఆ నోటీసులో ఇమ్రాన్ ఖాన్ అక్టోబర్ 28వ తేదీలోగా భారత్ విడిచి వెళ్లాలని పేర్కొన్నారు.

    కేంద్ర ప్రభుత్వం తరఫున హాజరైన అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ (ఏఎస్‌జీ), తదుపరి విచారణ జరిగే వరకు ఇమ్రాన్ ఖాన్‌పై ఎలాంటి చర్యలు తీసుకోబోమని కోర్టుకు మౌఖికంగా హామీ ఇచ్చారు.

    తదుపరి విచారణ వరకు ఈ కేసులో తదుపరి చర్యలను కూడా కోర్టు నిలిపివేసింది.

    ముంబైలోని ఫారినర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్(ఎఫ్‌ఆర్‌ఆర్‌ఓ) అక్టోబర్ 14న జారీ చేసిన ‘భారత్ విడిచి వెళ్లాలనే నోటీసు’ను సవాలు చేస్తూ ఇమ్రాన్ ఖాన్ బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

    ఒక నిరసన కార్యక్రమంలో పాల్గొన్నందున ఈ నోటీసు జారీ చేసినట్లు ఎఫ్‌ఆర్‌ఆర్‌ఓ పేర్కొంది.

  11. చీర కట్టుకుని చెప్పులు లేకుండా పరుగెత్తిన కవితా దేవి ‘హోంగార్డ్’ కల ఎందుకు నెరవేరలేదు?

  12. అభిషేక్ శర్మ తుపాన్ బ్యాటింగ్, న్యూజీలాండ్‌పై 35 బంతుల్లోనే సెంచరీ.. 6 వికెట్లతో భారత్ గెలుపు

  13. అర్నబ్ తుపాను ప్రభావంతో రద్దైన రైళ్లు ఇవే- దక్షిణమధ్య రైల్వే అధికారిక ప్రకటన

    అర్నబ్, విశాఖ, దక్షిణ మధ్య రైల్వే, సికింద్రాబాద్,
    ఫొటో క్యాప్షన్, రైళ్లు రద్దు చేస్తున్నట్టు అధికారిక ప్రకటన విడుదల చేసిన దక్షిణ మధ్యరైల్వే

    అర్నబ్ తుపాను ప్రభావిత ప్రాంతల గుండా రాకపోకలు సాగించే రైళ్లు రద్దు చేసినట్టు దక్షిణ మధ్యరైల్వే ఒక ప్రకటనలో తెలిపింది.

    పశ్చిమ- మద్య బంగాళాఖాతంలో ఏర్పడిన అర్నబ్ తుపాను ప్రభావం రవాణా రంగం తీవ్రంగా ఉంది. ఇప్పటికే విమానాల సర్వీసులపై ఎఫెక్ట్ పడుతుందని జాగ్రత్తగా చెక్ చేసుకుంటూ ఉండాలని ఎయిర్ ఇండియా తన ప్రయాణికులకు సూచించింది.

    ఇప్పుడు దక్షిణ మధ్య రైల్వే కూడా ఒక ప్రకటన చేసింది. తుపాను ప్రభావిత ప్రాంతాల మీదుగా రాకపోకలు సాగేంచే పలు రైళ్లను రద్దు చేసింది.

    ఇవాళ రద్దు అయిన రైళ్లు ఇవే

    • 12704 సికింద్రబాద్- హౌడా
    • 17016 సికింద్రాబాద్- భువనేశ్వర్ న్యూ
    • 12728 హైదరాబాద్- విశాఖపట్నం
    • 12862 మహబూబ్‌నగర్- విశాఖపట్నం
    • 12740 సికింద్రాబాద్- విశాఖపట్నం
    • 12776 లింగంపల్లి- కాకినాడ టౌన్
    • 17256 లింగంపల్లి- నర్సాపూర్
    • 12738 లింగంపల్లి- కాకినాడ పోర్ట్
    • 20810 హెఎస్ నాందేడ్- సంబల్‌పూర్
    • 07037 చర్లపల్లి- శ్రీకాకుళం రోడ్

    రేపు(28/10/2026) రద్దు అయిన రైళ్లు ఇవే

    • 07038 శ్రీకాకుళం రోడ్ – చర్లపల్లి
    • నాగర్‌సోల్- నర్సాపూర్ మధ్య నడిచే 12788 ట్రైన్‌ను చర్లపల్లి నర్సాపూర్ మధ్య తాత్కాలికంగా రద్దు చేశారు.
  14. ‘అర్నబ్’ తుపానుకు ఆ పేరు ఎలా వచ్చింది? అసలు తుపానులకు పేర్లు ఎలా పెడతారు?

  15. అర్నబ్ తుపాను ప్రభావిత ప్రాంతాల కోసం ప్రత్యేక కంట్రోల్ రూంలు ఏర్పాటు

    అర్నబ్ తుపాను ప్రభావిత ప్రాంతాల కోసం ప్రత్యేక కంట్రోల్ రూంలు ఏర్పాటు
    ఫొటో క్యాప్షన్, అర్నబ్ తుపాను ప్రభావిత ప్రాంతాల కోసం ప్రత్యేక కంట్రోల్ రూంలు ఏర్పాటు

    పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా మారిన ‘అర్నబ్’ కోసం అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ప్రభావిత ప్రాంతాల ప్రజల కోసం కంట్రోల్ రూంలను ఏర్పాటు చేసినట్టు ఆంధ్రప్రదేశ్రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఫోన్ నెంబర్లను విడుదల చేసింది.

    ఈ తుపాను ప్రభావంతో విశాఖ, శ్రీకాకుళం,విజయనగరం, మన్యం, కోనసీమ, అనకాపల్లి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ ప్రకటించారు.

    అర్నబ్ తుపాన్ వేళ ప్రభావిత జిల్లాల కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన నెంబర్లను విడుదల చేశారు.

    అత్యవసర సహాయం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థలోని కంట్రోల్ రూమ్ నంబర్లు 112 , 1070 , 1800 425 0101 నెంబర్లకు ఫోన్ చేయవచ్చు. మనమిత్ర వాట్సాప్ నంబర్ 9552300009 ద్వారా తుపాన్ స‌మ‌స్యలకు వేగవంతమైన పరిష్కారం పొందవచ్చని ప్రఖర్ జైన్ తెలిపారు.

    • శ్రీకాకుళం- 08942240557
    • విజయనగరం- 8922236947
    • పార్వతీపురం మన్యం- 08963450347
    • అల్లూరి సీతారామరాజు- 8935293448
    • విశాఖపట్నం- 0891-2590102 / 0891-2590100
    • అనకాపల్లి- 08924-222888 / 08924-226599 / 08924-225999
    • కాకినాడ-0884-2356801 / 9849903879
    • కోనసీమ-8856293104
    • తూర్పు గోదావరి-8832944455
    • పశ్చిమ గోదావరి-08816-299181
    • ఏలూరు-18002331077 / 9494041419
    • పోలవరం-18004254225
    • తిరుపతి-0877 2236007
    • మార్కాపురం-9248702500
    • కృష్ణా-08672 252399
    • ఎన్టీఆర్- 9154970454
    • గుంటూరు- 0863-2234014
    • బాపట్ల- 08643-220226
    • ప్రకాశం- 08592 295600 / 18004250277
    • నెల్లూరు- 7995576699
  16. రైళ్ల రద్దు, విద్యాసంస్థలకు సెలవులు, నిత్యావసరాలు రెడీ చేసుకుంటున్న ప్రజలు.. అర్నబ్ తుపాను ఆంధ్రప్రదేశ్‌పై ఎలాంటి ప్రభావం చూపుతోందంటే

  17. ‘జైలులో అనారోగ్యం నటించారు.. సిబ్బందిపై దాడి చేసి 17 మంది పారిపోయారు’

  18. ‘జ్ఞానేశ్ కుమార్ ఒక్కరే నిర్ణయాలు తీసుకోరు, ఫామ్-6లో ఎలాంటి మార్పులు చేయలేదు’.. సుప్రీంకోర్టుకు సమాధానం ఇచ్చిన ఎలక్షన్ కమిషన్

  19. ఎల్ నినో ‘అత్యంత తీవ్రరూపం’ దాల్చబోతోందా? ఇది ఎప్పటివరకు కొనసాగొచ్చు? ‘ఇన్‌కాయిస్’ ఏం చెప్పింది?

  20. ఆంధ్రప్రదేశ్ స్థానిక పోరులో ‘నామినేషన్ల’ రగడ: ప్రజాస్వామ్యమా లేక బలప్రదర్శనా?