సీబీఐ: మెహుల్ చోక్సీ రెడ్ కార్నర్ నోటీస్ కోసం మళ్లీ అప్పీలు చేస్తాం

పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు సంబంధించిన రూ.13,000 కోట్ల కుంభకోణంలో మెహుల్ చోక్సీ ప్రధాన నిందితునిగా ఉన్నారు.

లైవ్ కవరేజీ

  1. E20 వివాదం: ఎక్స్, మెటా, గూగుల్‌లపై సివిల్ దావాకు గడ్కరీకి హైకోర్టు అనుమతి

    E20, నితిన్ గడ్కరీ, బాంబే హైకోర్టు

    ఫొటో సోర్స్, Prakash Singh/Bloomberg via Getty Images

    ఫొటో క్యాప్షన్, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ

    సోషల్ మీడియా, ఇంటర్నెట్‌లో తనకు పరువు నష్టం కలిగించేలా ఉన్న డీప్‌ఫేక్, ఏఐ పోస్టులపై సివిల్ దావా దాఖలు చేయడానికి కేంద్ర మంత్రి, సీనియర్ బీజేపీ నాయకుడు నితిన్ గడ్కరీకి బాంబే హైకోర్టు సోమవారం అనుమతి ఇచ్చింది.

    లైవ్ లా వెబ్ సైట్ అందించిన సమాచారం ప్రకారం జస్టిస్ అభయ్ అహూజా ధర్మాసనం ఈ కేసును విచారించింది. గడ్కరీ తరఫున న్యాయవాది సందీప్ ఎస్. లడ్డా హాజరై, ఈ దావా వేయడానికి కోర్టు అనుమతి కోరారు.

    దాంతో ఎక్స్, మెటా, గూగుల్‌తో పాటు ఇతర గుర్తుతెలియని వ్యక్తులపై సివిల్ కేసు దాఖలు చేయడానికి కోర్టు గడ్కరీకి అనుమతినిచ్చింది. ఈ వివాదాస్పద పోస్టులను వెంటనే తొలగించాలని, తనకు తగిన ఉపశమనం కలిగించాలని ఆయన కోర్టును ఆశ్రయించారు.

    రూ. 11 కోట్ల నష్టపరిహారం డిమాండ్

    ఇథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్ ద్వారా గడ్కరీ, ఆయన కుటుంబ సభ్యులు ఆర్థికంగా లాభపడ్డారంటూ ఈ పోస్టుల ద్వారా తప్పుడు ప్రచారం చేశారని పిటిషన్‌లో పేర్కొన్నారు.

    ఈ ప్రకటనల్లో అవినీతి, పక్షపాతం, స్వార్థ ప్రయోజనాలు, పదవి దుర్వినియోగం వంటి తీవ్రమైన ఆరోపణలు చేశారనీ గడ్కరీ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. పరువు నష్టం కలిగించేలా ఉన్న ఇలాంటి 24 పోస్టులను గడ్కరీ తన పిటిషన్‌లో ప్రస్తావిస్తూ, వాటిని తొలగించాలని కోరారు. తన అనుమతి లేకుండా డీప్‌ఫేక్ రూపంలో తన గుర్తింపును, ప్రతిష్ఠను వాడుకోవడం వ్యక్తిగత హక్కుల ఉల్లంఘనే అవుతుందని ఆయన వాదించారు. ఈ మేరకు రూ. 11 కోట్ల నష్టపరిహారం కూడా చెల్లించాలని డిమాండ్ చేశారు.

    ఇ20, అరవింద్ కేజ్రీవాల్

    ఫొటో సోర్స్, ANI

    E20 కి వ్యతిరేకంగా పోరాడుదాం: కేజ్రీవాల్

    ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత, ఇకపై ‘E20’ కి వ్యతిరేకంగా గళం విప్పుతామని దిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.

    సోమవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ "దేశ యువత ఒక అహంకార ప్రభుత్వాన్ని తలవంచేలా చేసింది, దాంతో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సి వచ్చింది. ఈ సందర్భంలోనే E20 ఇంధనం సమస్యను కూడా పరిష్కరించాలని ప్రధానమంత్రి మోదీని కోరుతున్నాను. ప్రజలు దీనివల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు, వారి వాహనాలు పాడవుతున్నాయి" అన్నారు.

    "ఈ అంశంపై అందరినీ ఒక తాటిపైకి తీసుకురావడానికి, ఈ శనివారం మధ్యాహ్నం 12 గంటల నుంచి E20కి వ్యతిరేకంగా నేషనల్ టౌన్‌హాల్ నిర్వహిస్తున్నాం" అన్నారు.

  2. పాములకు పాలు తాగించడం వాటి ప్రాణాలకు ప్రమాదకరమా, బలవంతంగా తాగిస్తే వాటి శరీరంలో ఏం జరుగుతుంది?

  3. గుండెకు స్టంట్ వేస్తే ఎన్ని రోజుల తరువాత నుంచి సెక్స్‌లో పాల్గొనవచ్చు?

  4. స్మృతి ఇరానీ, ప్రకాశ్ జావదేకర్, రమేశ్ పోఖ్రియాల్, ధర్మేంద్ర ప్రధాన్.. విద్యా శాఖలో ఏ మంత్రీ ఎక్కువ కాలం ఎందుకు నిలవలేకపోయారు?

  5. పబ్లిక్ ఎగ్జామినేషన్స్(ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) సవరణ బిల్లు ప్రవేశపెట్టనున్న కేంద్రం

    ఆందోళన, నీట్

    ఫొటో సోర్స్, Getty Images

    ఫొటో క్యాప్షన్, పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్)సవరణ బిల్లు

    ప్రశ్నపత్రాల లీకేజ్‌లను నివారించడానికి, పబ్లిక్ ఎగ్జామినేషన్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) యాక్ట్, 2024కు సవరణలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఇవాళ లోక్‌సభలో ఒక బిల్లును ప్రవేశపెట్టనుంది.

    కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నారు.

    ప్రశ్నాపత్రాలను లీక్ కేసుల్లో దోషులు వారికి పదేళ్ల వరకు జైలు శిక్ష, ఐదు నుంచి పది కోట్ల రూపాయల వరకు జరిమానా విధించవచ్చు. ఇలాంటి కేసుల కోసం కేంద్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయనుంది. పరీక్షకు అయిన ఖర్చును కూడా దోషుల నుంచి వసూలు చేస్తారు. వారిని ఎనిమిదేళ్లపాటు ఎలాంటి ప్రభుత్వ పరీక్షలు రాయకుండా నిషేధిస్తారు. గతంలో జరిమానా కోటిరూపాయలుగా ఉండేది. నిషేధం నాలుగేళ్లు ఉండేది.

    ప్రతిపాదిత బిల్లు ప్రకారం పేపర్ లీకేజ్ కేసుల దర్యాప్తును సీబీఐ లేదా సిట్ రెండు నెలల్లోగా పూర్తి చేయాల్సి ఉంటుంది.

  6. కామన్‌వెల్త్ గేమ్స్: వరుసగా మూడోసారి స్వర్ణం గెలిచిన మీరాబాయి చనూ

  7. ఫ్యాటీ లివర్ ఉన్నవారు మద్యం పూర్తిగా మానేయాలా? ఎన్నో ప్రశ్నలు - సమాధానాలు

  8. ‘చట్టబద్ధమైన పనులను కూడా నేరంగా మారుస్తున్నారు, నిరసన తెలిపితే జైలుకు పంపుతున్నారు’: సుప్రీం కోర్టు న్యాయమూర్తి వ్యాఖ్యలపై తీవ్ర చర్చ

  9. 'పాక్‌ పాలిత కశ్మీర్‌‌‌'లో చెలరేగిన హింసపై ఐక్యరాజ్యసమితి ఆందోళన, భారత్ వాదనేంటి, పాకిస్తాన్ ఏమంటోంది?

  10. సీజేపీ: వీధి పోరాటం నుంచి విద్యాశాఖ మంత్రి రాజీనామా వరకు.. ఎప్పుడెప్పుడు, ఏం జరిగింది?

  11. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు దారి తీసిన ఐదు కారణాలు ఇవేనా?

  12. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా: ఇది మోదీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బా లేక ఒక పెద్ద అవకాశమా?

  13. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి విద్యా శాఖ బాధ్యతలు

    విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్‌ జోషి

    ఫొటో సోర్స్, Sonu Mehta/Hindustan Times via Getty Images

    ఫొటో క్యాప్షన్, ప్రహ్లాద్‌ జోషి కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ శాఖల మంత్రిగా ఉన్నారు

    కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషికి విద్యా శాఖ అదనపు బాధ్యతలు చేపట్టనున్నారు.

    కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో ఆ శాఖ బాధ్యతలను జోషీకి అప్పగిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆదేశాలు జారీ చేసినట్లు రాష్ట్రపతి డిప్యూటీ ప్రెస్ సెక్రటరీ ఒక ప్రకటనలో తెలిపారు.

    ప్రధాన మంత్రి మోదీ సూచనల మేరకు, విద్యా శాఖ అదనపు బాధ్యతలను ప్రహ్లాద్ జోషీకి అప్పగిస్తూ రాష్ట్రపతి నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు.

    జోషి ప్రస్తుతం కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ శాఖల మంత్రిగా ఉన్నారు. ఆయన వద్దే పునరుత్పాదక ఇంధన శాఖ పోర్ట్‌ఫోలియో కూడా ఉంది.

    ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను ముర్ము అధికారికంగా ఆమోదించినట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

  14. సీజేపీ అన్ని డిమాండ్లకు ప్రభుత్వం సంపూర్ణంగా అంగీకరించిందా, బాధిత కుటుంబాలకు పరిహారం గురించి ఏం చెప్పారు?

  15. 'మనం అనుకున్నది సాధించాం' - అభిజీత్ దీప్కే

  16. జంతర్ మంతర్ వద్ద యువత సంబరాలు, 9 ఫోటోల్లో...

  17. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై ప్రతిపక్షాలు ఏమన్నాయంటే..

    ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా

    ఫొటో సోర్స్, Getty Images

    ఫొటో క్యాప్షన్, ఎన్సీపీ(ఎస్పీ) అధినేత శరద్ పవార్, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే

    కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను ప్రతిపక్ష నాయకులు స్వాగతించారు. ఇది యువత నేతృత్వంలో సాగిన ఉద్యమ విజయంగా అభివర్ణించారు.

    ఇది "దేశవ్యాప్తంగా విద్యా వ్యవస్థలో మార్పులు చేయాలని కోరుతూ వీధుల్లోకి వచ్చిన మన లక్షలాది మంది యువత సాధించిన విజయం" అని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు.

    ఎన్సీపీ(ఎస్పీ) అధినేత శరద్ పవార్ దీనిని, "దేశ యువత సమైక్య బలంతో సాధించిన ఒక భారీ విజయంగా అభివర్ణించారు. ఆయన ఎక్స్ పోస్టులో "అణచివేతకు భయపడకుండా అన్యాయానికి వ్యతిరేకంగా యువత బలంగా నిలబడి, ప్రభుత్వం నైతిక బాధ్యత వహించేలా చేసిన ఈ పోరాటం. ప్రజాస్వామ్య బలానికి నిదర్శనంగా నిలుస్తుంది" అని రాశారు.

    ఇది "యువత సాధించిన పెద్ద విజయం" అని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ అన్నారు. అయితే, భవిష్యత్తులో పేపర్ లీక్‌లను అరికట్టడానికి, పరీక్షా విధానాలను బలోపేతం చేయడానికి ఈ ఘటన అన్ని రాజకీయ పార్టీలకు ఒక పాఠంగా ఉపయోగపడాలని అభిలషించారు.

    ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు అరవింద్ కేజ్రీవాల్ కూడా దీనిని "ప్రజాస్వామ్యానికి దక్కిన భారీ విజయం"గా అభివర్ణించారు.

  18. ధర్మేంద్ర ప్రధాన్: ఒకప్పుడు పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా లాఠీ దెబ్బలు తిన్న వ్యక్తి.. ఇప్పుడు అదే వ్యవహారంలో రాజీనామా, విద్యార్థి నేత నుంచి కేంద్ర మంత్రి వరకు..

  19. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, 'మనం సాధించాం' అన్న సీజేపీ

  20. సోనమ్ వాంగ్‌చుక్: ‘బాధ, ఆవేదన, కోపంతో ఈ మాటలు మాట్లాడుతున్నా’