ఈ లైవ్ పేజీని ఇంతటితో ముగిస్తున్నాం. గుడ్‌నైట్
ఈరోజు ముఖ్యమైన వార్తలు కొన్నింటిని ఇక్కడ చూడండి.
అర్నబ్ తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో ఏడుగురు చనిపోయారని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పినట్టు న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ రిపోర్ట్ చేసింది.
ఈ లైవ్ పేజీని ఇంతటితో ముగిస్తున్నాం. గుడ్‌నైట్
ఈరోజు ముఖ్యమైన వార్తలు కొన్నింటిని ఇక్కడ చూడండి.
అర్నబ్ తుపాను నర్సాపురం పట్టణంపై తీవ్ర ప్రభావం చూపింది.
చిరంజీవితో పాటు మరికొందరు ప్రముఖులు చదువుకున్న పట్టణంలోని వైఎన్ కాలేజీ తుపాను వల్ల తీవ్రంగా నష్టోయింది.
వందేళ్లపైబడిన చెట్లు కూడా తుఫాన్ తీవ్రతకు కూకటివేళ్లతో సహా పడిపోయాయి.

ఫొటో సోర్స్, Asghar Besharati/Getty Images
ఒకప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద ఎల్ఎన్జీ ఎగుమతిదారుల్లో ఒకటైన ఖతార్ అమెరికా నుంచి గ్యాస్ కొనుగోలు చేసుకునేందుకు కీలక ఒప్పందం చేసుకుంది.
ఇరాన్‌తో కొనసాగుతున్న యుద్ధం, హార్ముజ్ జలసంధి దిగ్బంధనం కారణంగా ఖతార్‌లో ఎల్ఎన్జీ ఉత్పత్తి భారీగా తగ్గిపోయింది.
దీంతో అమెరికా నుంచి గ్యాస్ దిగుమతి చేసుకునేలా 20 ఏళ్ల ఒప్పందం కుదుర్చుకుంది.
అమెరికాలోని లూసియానా రాష్ట్రంలో ఉన్న ఒక ప్లాంట్ నుంచి ఏడాదికి 30 లక్షల టన్నుల గ్యాస్ దిగుమతికి ఖతార్ ఎనర్జీ ఈ ఒప్పందంపై సంతకాలు చేసింది.
ఈ ఒప్పందం ప్రకారం 2030 నుంచి గ్యాస్ సరఫరా ప్రారంభమవుతుంది.
ఈ ఒప్పందం దీర్ఘకాలికంగా ఉండడం చూస్తే హార్ముజ్ జలసంధి విషయంలో కొనసాగుతున్న సంక్షోభం త్వరలో ముగిసే అవకాశం లేదని ఖతార్ భావిస్తున్నట్టు అర్థమవుతోందని విశ్లేషకులు అంటున్నారు.

ఫొటో సోర్స్, Arun SANKAR / AFP via Getty Images
ఇండియా కూటమి నిర్వహించే ‘ఛలో దిల్లీ’ మార్చ్‌లో పాల్గొనాలని లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రజలకు పిలుపునిచ్చారు.
పోలీసులకు, వారి లాఠీలకు భయపడొద్దని ‘ఎక్స్‌లో చేసిన పోస్ట్‌లో రాహుల్ గాంధీ ప్రజలను కోరారు.
ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి, ఓట్ల చోరీని అరికట్టడానికి, రాజ్యాంగాన్ని రక్షించడానికి ఈ మార్చ్ నిర్వహిస్తున్నట్టు రాహుల్ గాంధీ చెప్పారు.
"నరేంద్ర మోదీ, అమిత్ షా, జ్ఞానేశ్ కుమార్ల మీద విసిగిపోయినవారు, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, రాజ్యాంగాన్ని రక్షించాలని కోరుకునేవారంతా ఈ మార్చ్‌లో పాల్గొనాలని ఆహ్వానిస్తున్నా’’ అని రాహుల్ గాంధీ అన్నారు.
రాహుల్ గాంధీ పోస్టును కాంగ్రెస్ నాయకుడు పవన్ ఖేరా ట్యాగ్ చేశారు.
‘‘తెలంగాణకు రైళ్లు ఇవ్వడం నిరాకరించడం నుంచి దిల్లీ వ్యాపారులను రాజకీయ ఆయుధాలుగా ఉపయోగించడంవరకు నవంబర్ ఒకటిన జరిగే మార్చ్‌ను భగ్నం చేయడానికి బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు సఫలం కావు" అని పవన్ ఖేరా రాశారు.
.

ఫొటో సోర్స్, Getty Images
మధుమేహం ఉన్న ప్రతి ఒక్కరికీ నరాల సమస్యలు రావు. అయితే వ్యాధి వ్యవధి పెరిగేకొద్దీ, రక్తంలో చక్కెర నియంత్రణ సరిగా లేకపోతే, ఇతర ప్రమాద కారకాలు ఉన్నప్పుడు నరాలు దెబ్బతినే అవకాశం పెరుగుతుంది.
అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ (ఏడీఏ) 2026 మార్గదర్శకాల ప్రకారం, డయాబెటిక్ పెరిఫెరల్ న్యూరోపతి ఉన్నవారిలో దాదాపు 50 శాతం మందికి స్పష్టమైన లక్షణాలు కనిపించకపోవచ్చు. అందుకే లక్షణాలు వచ్చే వరకు వేచి ఉండకుండా పరీక్షలు చేయించుకోవడం అవసరం. మరింత కథనం కోసం ఇక్కడ క్లిక్ చేసి చదవండి.

ఫొటో సోర్స్, Ananda Manjon/Europa Press via Getty Images
స్పెయిన్ రైలు ప్రమాదంపై ఆగ్రహం వ్యక్తంచేస్తూ రవాణా శాఖ కార్యాలయం ముందు ప్రజలు నిరసన తెలిపారు.
రవాణా మంత్రిత్వ శాఖ బయట గుమిగూడిన నిరసనకారులు రైలు ప్రమాదానికి బాధ్యులెవరో తేల్చాలని డిమాండ్ చేశారు.
రైలు ప్రమాదమృతులకు నివాళిగా అటోచా రైల్వే స్టేషన్లో ఒక స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేసి జాతీయ జెండాలను సగం వరకు అవనతం చేశారు.

ఫొటో సోర్స్, Reuters

ఫొటో సోర్స్, EPA/Shutterstock

ఫొటో సోర్స్, Ananda Manjon/Europa Press via Getty Images

ఫొటో సోర్స్, Andhra Pradesh I&PR
అర్నబ్ తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో ఏడుగురు చనిపోయారని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పినట్టు న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ రిపోర్ట్ చేసింది.
ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం వల్ల ప్రాణనష్టాన్ని తగ్గించగలిగినప్పటికీ ఏడుగురు చనిపోయారని చంద్రబాబు చెప్పారు.

ఫొటో సోర్స్, JAVIER SORIANO / AFP via Getty Images
స్పెయిన్ రైలు ప్రమాదం ఆధునిక యూరప్ చరిత్రలోనే అత్యంత ఘోరమైన రైలు ప్రమాదాలలోఒకటి. ఇది జరగడానికి కేవలం కొన్ని నిమిషాల ముందు రైలు డ్రైవర్లకు, రైల్వే కంట్రోల్ సెంటర్‌కు మధ్య జరిగిన సంభాషణలకు సంబంధించిన ఆడియో రికార్డులు స్పెయిన్ మీడియాలో వచ్చాయి.
సాంకేతిక సమస్యలు తలెత్తిన తర్వాత కంట్రోల్ సెంటర్ ఆపరేటర్ ఒక రైలు డ్రైవర్‌తో "మీ ప్రయాణాన్ని సాధారణ వేగంతో కొనసాగించండి" అని చెప్పడం ఓ ఆడియో రికార్డింగ్‌లో ఉంది.
రైలు నియంత్రణ వ్యవస్థతో తమకు సంబంధాలు తెగిపోయాయని, తాము ఉర్దాలో ఆగిపోయామని 'ఇర్యో' రైలు డ్రైవర్ చెప్పినట్టు ఇంకో ఆడియో రికార్డులో ఉన్నట్టు బీబీసీకి సమాచారమందింది.
ప్రమాదంలో మరణించినవారికి సంతాపంగా స్పెయిన్‌లో మూడు రోజుల జాతీయ సంతాప దినాలు ప్రకటించారు.
మాడ్రిడ్ నుంచి సెవిల్లేకు ప్రయాణిస్తున్న ఒక రైలు బుధవారం(అక్టోబర్ 18)ఉదయం మరో రైలును ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో 69 మంది మరణించారు. పదులసంఖ్యలో ప్రయాణికులు గాయపడ్డారు.
ప్రమాదంలో చిక్కుకుపోయినవారికోసం అత్యవసర సహాయక బృందాలు రాత్రంతా బోగీలను కత్తిరిస్తూ గాలింపు చర్యలు నిర్వహించాయి. ఈ ప్రమాదంలో మరణించిన వారిలో చాలా మందిని ఇంకా గుర్తించలేదు.
రైలు ప్రమాదం జరిగిన ప్రాంతాలకు దగ్గరలో సహాయ కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు స్పెయిన్ ప్రధాన మంత్రి పెడ్రో సాంచెజ్ తెలిపారు. ప్రమాద బాధితులు, వారి కుటుంబ సభ్యులు, ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఉన్న ఇతర వ్యక్తులకు మానసిక సాయం అందిస్తున్నట్టు చెప్పారు.
సహాయక బృందాలు "అద్భుతంగా పనిచేశాయని ప్రశంసించారు. ప్రమాదానికి కారణాలను తెలుసుకోవడానికి స్పెయిన్ ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోందని అన్నారు.

ఫొటో సోర్స్, Facebook/SCR

ఫొటో సోర్స్, SCR
అర్నబ్ తుపాను ప్రభావంతో షాలిమర్ నుంచి చర్లపల్లికి నడిచే, చర్లపల్లి నుంచి షాలిమార్‌కు వెళ్లే రైలును రద్దుచేశారు.
ఝాదుపూడి-ఇచ్ఛాపురం మధ్య బ్రిడ్జిపైనుంచి వరదనీళ్లు ప్రవహిస్తుండడంతో షాలిమర్ నుంచి చర్లపల్లి, షాలిమర్ నుంచి సికింద్రాబాద్ వైపు నడిచే రైళ్లను ఖుర్దా రోడ్- అంగుల్- సంబల్పూర్- టిట్లాగఢ్-రాయగడ-విజయనగరం మార్గం గుండా దారిమళ్లించారు.
సికింద్రాబాద్-హౌరా, సికింద్రాబాద్-భువనేశ్వర్ న్యూ, భువనేశ్వర్ న్యూ- సీఎస్టీ ముంబై రైళ్లను రీషెడ్యూల్ చేశారు.
సముద్రంలోని వెచ్చని నీటి వల్ల దాని పైనున్న గాలి వేడెక్కి వేగంగా పైకి లేస్తుంది.ఆ గాలి పైకి వెళ్లి చల్లబడినప్పుడు, కింద నుంచి మరింత వెచ్చని గాలి పైకి వస్తుంది. దీంతో చల్లబడిన గాలి పక్కకు కదులుతుంది. దీనివల్ల సముద్ర ఉపరితలం దగ్గర గాలిపీడనం తగ్గుతుంది. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగడం వల్ల గాలి పీడనం మరింతగ్గి బలమైన గాలుల వీయడం మొదలవుతుంది.. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఫొటో సోర్స్, IMD
అతి తీవ్ర తుఫాను ‘అర్నబ్’ బలహీనపడి ప్రస్తుతం దక్షిణ ఛత్తీస్‌గఢ్, దానికి ఆనుకుని ఉన్న దక్షిణ ఒడిశా ప్రాంతాల్లో అల్పపీడనంగా కొనసాగుతోందని భారత వాతావరణ శాఖ తెలిపింది.
గత ఆరు గంటల్లో గంటకు 18 కిలోమీటర్ల వేగంతో ఉత్తర దిశగా కదిలింది.
ఈ అల్పపీడనం ఉత్తర దిశగా కదులుతూ, ఈ సాయంత్రానికి ఉత్తర ఛత్తీస్‌గఢ్, దానికి ఆనుకుని ఉన్న వాయువ్య ఒడిశా ప్రాంతాల్లో మరింత బలహీనపడనుంది.
ఈ రోజు ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో, ఈశాన్య తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్‌లోని కొన్నిచోట్ల విస్తృతంగా వర్షాలు కురిశాయి. ఆంధ్రప్రదేశ్‌లో కొన్నిచోట్ల, దక్షిణ ఒడిశాలో అక్కడక్కడా అత్యంత భారీ వర్షాలు (21 సెంటీమీటర్లు లేదా అంతకంటే ఎక్కువ) కురిశాయి. మరికొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు పడ్డాయి. కోస్తాంధ్రలో భారీ వర్షాలు కొనసాగే అవకాశముంది.
కోనసీమ జిల్లాలో అర్నబ్ తుపాను బీభత్సం సృష్టించింది. అనేక గ్రామాలపై తుఫాన్ ప్రభావం చూపింది. ప్రస్తుతం సహాయకకార్యక్రమాలు కొనసాగుతున్నాయి. తుపాను తీవ్రతను చూపే కొన్ని ఫోటోలు చూడండి.





ఫొటో సోర్స్, @APSDMA
కాకినాడ జిల్లాలోని తీర ప్రాంతంలో మత్స్యకారులకు చెందిన బోటు మంగళవారం బోల్తా పడింది.
ఈ ఘటనలో గల్లంతైన మత్స్యకారులను రెస్క్యూ సిబ్బంది కాపాడి ఒడ్డుకు చేర్చారు.
తాళ్లరేవు మండలం చొల్లంగిపేటకు చెందిన ముగ్గురు మత్స్యకారులు వేటకు వెళ్లారని.. వారు వెళ్తున్న బోటు సముద్రంలో బోల్తా పడడంతో వారంతా ఈదుకుంటూ వెళ్లి హోప్ ఐలాండ్‌కు చేరుకున్నారని అధికారులు చెప్పారు.
దీనికి సంబంధించిన సమాచారం మత్స్యశాఖ, ఆర్టీజిఎస్, విపత్తుల నిర్వహణ సంస్థలకు చేరింది.
వెంటనే అప్రమత్తమై రంగంలోకి దిగిన రెస్క్యూ సిబ్బంది 10 బోట్ల సహాయంతో సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాయి. చివరకు ఇవాళ వారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.

ఫొటో సోర్స్, Getty Images
దక్షిణ అండమాన్ సముద్రం, పరిసర ప్రాంతాలపై అల్పపీడన ప్రాంతం ఏర్పడిందని ఐఎండీ పేర్కొంది.
ఇది రాబోయే 24 గంటల్లో పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతుందని తెలిపింది.
దక్షిణ అండమాన్ సముద్రం, దానిని ఆనుకుని ఉన్న అండమాన్ & నికోబార్ దీవులపై ప్రభావం చూపుతుంది. మరో 24 గంటల్లో ఇది వాయుగుండంగా కేంద్రీకృతమయ్యే అవకాశం ఉంది.
మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో విధ్వంసం సృష్టించిన అర్నబ్ తుపాను ఇప్పుడు అల్పపీడనంగా మారింది.
ఆంధ్రప్రదేశ్, దాన్ని ఆనుకొని ఉన్న దక్షిణ ఒడిశా, దక్షిణ ఛత్తీస్‌గఢ్, ఈశాన్య తెలంగాణ ప్రాంతాల మీదుగా గంటకు 22 కిలోమీటర్ల వేగంతో దాదాపు ఉత్తరం వైపు కదిలుతోంది.
గురువారం ఉదయం 5.30 గంటలకు, దక్షిణ ఛత్తీస్‌గఢ్, ఆనుకొని ఉన్న దక్షిణ ఒడిశా వద్ద కేంద్రీకృతమై ఉంది.
ఇది జగదల్పూర్ (ఛత్తీస్‌గఢ్)కు పశ్చిమాన సుమారు 20 కిలోమీటర్లు, భవానీపట్నానికి (ఒడిశా) నైరుతి దిశలో 170 కిలోమీటర్లు, టిట్లాగఢ్ (ఒడిశా)కు నైరుతి దిశలో 210 కిలోమీటర్లు, రాయ్‌పూర్‌కు దక్షిణాన 250 కిలోమీటర్ల దూరంలో ఉంది.
ఇది ఉత్తరం వైపు కదులుతూ సాయంత్రానికి బలహీనపడి స్పష్టమైన అల్పపీడన ప్రాంతంగా మారే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది.
తుపాను కారణంగా తీర ప్రాంతాల్లోని సుమారు 28వేల మందిని పునరావాస శిబిరాలకు తరలించినట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది.
అలాంటి వారిలో చెక్క చిన్ని ఒకరు. ఆమె ఏడు నెలల గర్భిణి.
కోనసీమ జిల్లా కాట్రేనికోవ మండలం మాగసాని తిప్ప గ్రామానికి చెందిన చెక్క సతీష్, ఆయన భార్య చిన్నికి ఇద్దరు పిల్లలు. చిన్ని ఇప్పుడు మూడోసారి గర్భంతో ఉన్నారు.
మంగళవారం పునరావాస కేంద్రానికి అధికారులు తరలించారు. సముద్రజలాలు వెనక్కి పోటెత్తడంతో మాగసానితిప్ప గ్రామంలోకి నీళ్లు చేరడంతో అక్కడికి వెళ్లే పరిస్థితి లేకుండా ఉంది. బలుసుతిప్ప గ్రామంలో తలదాచుకున్న చిన్ని బీబీసీతో మాట్లాడారు.
''మా ఊరు మునిగిపోయిందని చెప్పారు. అక్కడికి వెళ్లేందుకు వీల్లేకుండా ఉంది. బలుసుతిప్ప గ్రామంలో పునరావాస శిబిరం ఏర్పాటు చేశారు.
ఏడు నెలల గర్భంతో కింద పడుకోలేక బలుసుతిప్పలోని మా బంధువుల ఇంట్లో తలదాచుకుంటున్నా'' అని చెప్పారు.
''గాలుల భీకర శబ్దానికి బాగా భయమేసింది. ఎప్పుడో 1996లో తుపాను వచ్చిందట. అప్పటికి నేను పుట్టలేదు. నేను పుట్టాక ఇదే అతిపెద్ద తుపాను.
మొదటి బాబు కడుపులో ఉన్నప్పుడు కూడా తుపాను వచ్చింది. మళ్లీ మూడోసారి గర్భంతో ఉన్నప్పుడు తుపాను వచ్చింది.'' అని చెప్పారు చిన్ని.
మాగసానితిప్ప గ్రామానికి రాకపోకలు సాగించేందుకు రహదారి లేదా వంతెన సౌకర్యం లేదని చెప్పారు చిన్ని. గోదావరి నది పాయ ఉండటంతో పడవపైనే ప్రయాణించి బలుసుతిప్ప గ్రామానికి చేరుకున్నామని చెప్పారామె.
తుపాను ప్రభావిత జిల్లాల్లో ‘బీబీసీ’ మరికొందరితోనూ మాట్లాడింది. వారేమన్నారో ఈ కథనంలో చదవండి.

ఫొటో సోర్స్, @APSDMA
అర్నబ్ తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం పర్యటించనున్నారు.
మధ్యాహ్నం కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం చెయ్యేరులో పంటలు పరిశీలిస్తారు. అక్కడే రైతులతో మాట్లాడుతారు. అనంతరం తుపాను షెల్టర్లలో ఆశ్రయం పొందుతున్న ముంపు బాధితులతో మాట్లాడనున్నారు.
అంతకంటే ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లా స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. తుపాను కారణంగా ఇళ్లు, పంటలు, దుకాణాలు,ఇతర ఆస్తులు నష్టపోయిన వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని సీఎం తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.5లక్షల పరిహారం- సీఎం చంద్రబాబు ముంపు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరిన బాధితులకు 25కిలోల బియ్యం అందించాలని ఆదేశించినట్లు చెప్పారు.
చేనేత కార్మికులు, మత్స్యకారులకు 50 కిలోల బియ్యంతోపాటు కిలో చొప్పున ఉల్లి, వంటనూనె, కందిపప్పు అందిస్తామని ప్రకటించారు. షెల్టర్ క్యాంపుల్లో ఆశ్రయం పొందిన వారికి రూ.1,000చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని తెలిపారు.
పంట నష్టాన్ని మినహాయించి,ఇతర నష్టాలకు సంబంధించి అర్హులైన బాధితులకు గురువారం నుంచే ఆర్థిక సాయం అందించేలా చర్యలు చేపడతామని చెప్పారు. సుమారు 30వేల మంది క్షేత్రస్థాయి అధికారులు,సిబ్బందితో టెలి కాన్ఫరెన్సుల ద్వారా నిరంతరం సమన్వయం చేసుకున్నామని తెలిపారు.

ఫొటో సోర్స్, @APSDMA

ఫొటో సోర్స్, @wanjarri
కర్నాటక సహా దేశంలోని వివిధ ప్రాంతాల్లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి చవిచూసిన వేళ మహారాష్ట్రలోని ఒక స్థానం గెలవడం చర్చనీయాంశంగా మారుతోంది.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్వస్థలంలో జరిగిన ఎమ్మెల్సీ స్థానాన్ని కాంగ్రెస్ దక్కించుకుంది.
నాగపూర్ డివిజన్ గ్రాడ్యుయేట్ నియోజవర్గం కాంగ్రెస్ అభ్యర్థి అభిజిత్ వంజారి విజయం సాధించినట్టు ఏఎన్ఐ పేర్కొంది
మొదటి, రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు తర్వాత అభిజిత్‌కు 67, 231 ఓట్లు రాగా, తన ప్రత్యర్థి, బీజేపీ నేత 63, 960 ఓట్లు వచ్చాయి.
దీంతో కాంగ్రెస్ అభ్యర్థి 3,271 ఓట్ల తేడాతో విజయం సాధించారు.
“బీజేపీ బలాన్ని బలగాన్ని మోహరించింది. ఆ పార్టీ నేతలంతా నాగపూర్‌లో తిష్ట వేశారు. ఎన్ని చేసినప్పటికీ ఓటర్లు మాకు మద్దతు ఇచ్చారు. మా నేతలంతా ఒక్కటిగా నిలబడి మహా వికాశ్ అఘాడీ బలాన్ని నిరూపించారు” అని అభిజిత్ అభిప్రాయపడ్డారు.
"చాలా సంస్థలు మాకు మద్దతుగా నిలిచాయి. నా ప్రచార సామగ్రిలో కూడా నాకు 48 సంస్థలు మద్దతు ఇస్తున్నాయని పేర్కొన్నాను. ఈ విజయం ఆ సంస్థల కార్యకర్తలకు, నాయకులకు చెందుతుంది"
మంగళవారం వరకు వచ్చిన ఫలితాల్లో బిహార్, ఉత్తరప్రదేశ్, బిహార్, కర్నాటక, మహారాష్ట్రలో జరిగిన 28 స్థానాల ఎమ్మెల్సీల్లో ఒక్క సీటును కూడా కాంగ్రెస్ గెలుచుకోలేకపోయింది.
దీనిపై ప్రధానమంత్రి కూడా ఎక్స్‌లో పోస్టు పెట్టారు. నాలుగు రాష్ట్రాల్లో 28 ఎమ్మెల్సీ సీట్లకు ఎన్నికల జరిగాయి. బ్యాలెట్ పేపర్లతోనే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుచుకున్నవి ఎన్ని” అని ప్రశ్నించారు.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవంద్ర ఫడ్నవీస్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ పోస్టును షేర్ చేశారు. రాత్రికి దాన్ని తీసేశారు.

కోనసీమలో అర్నబ్ తుపాను బీభత్సం సృష్టించింది.
నేలకొరిగిన కొబ్బరి చెట్లు, విద్యుత్ స్తంభాలు, ధ్వంసమైన ఇళ్లు ఇక్కడ క్లిక్ చేసి చూడొచ్చు.
డా.బీఆర్ అంబేడ్కర్ జిల్లాలో పలుచోట్ల భారీ గాలులతో కూడిన వర్షాలు కురిశాయి.
మంగళవారం రాత్రి బాసర్లపూడిలో ఓ ఇంటి పైకప్పు ఎగిరిపోయింది.
యానాం నుంచి అమలాపురం వెళ్లే మార్గంలో కొబ్బరిచెట్లు నేలకొరిగాయి.
పలుచోట్ల విద్యుత్ స్తంభాలు నేలకొరిగి సరఫరా నిలిచిపోయింది. విద్యుత్ శాఖ అధికారులు సరఫరా పునరుద్ధరించే పనులు చేపట్టారు.

ఫొటో సోర్స్, @ravi_gottipati
అర్నబ్ తుపాను ప్రభావంతో పశ్చిమగోదావరి జిల్లాలో దెబ్బతిన్న పంటల నష్టాలను తక్షణమే అంచనా వేసి, బాధిత రైతులకు అవసరమైన సహాయం అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్టు మంత్రిగొట్టిపాటి రవి ప్రకటించారు.
తుపాను సహాయక చర్యలు, విద్యుత్ సరఫరా పునరుద్ధరణపై పశ్చిమగోదావరి జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించి, దెబ్బతిన్న 3,700 విద్యుత్ స్తంభాల మరమ్మతులు చేపట్టి, విద్యుత్ అంతరాయం ఏర్పడిన సుమారు 400 గ్రామాలకు గురువారం సాయంత్రంలోగా సరఫరాను పునరుద్ధరించాలని స్పష్టం చేశారు.
తుపాను ప్రభావిత ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు ఆటంకం కలగకుండా చూడటంతోపాటు, పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టి వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రజలకు నిత్యావసర సరుకులు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, బాధితులకు తక్షణ సహాయం అందిస్తూ సాధారణ పరిస్థితులు త్వరగా నెలకొనేలా అన్ని శాఖలు సమన్వయంతో అప్రమత్తంగా పనిచేయాలని స్పష్టం చేసినట్టు తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
అర్నబ్ తుపాను ప్రభావం ఒడిశాపై కూడా ఉంది. అందుకే అక్కడక్కడ ఇంకా వర్షాలు పడుతూనే ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.
ఒడిశా రాష్ట్రంలో రాయగడ జిల్లా కలెక్టర్ అశుతోష్ కులకర్ణి ఏఎన్ఐతో మాట్లాడుతూ... గత 24 గంటల వ్యవధిలో రాయగడలో 40 మిమీ వర్షపాతం నమోదైందని తెలిపారు.
ఇది ఊహించిన దానికంటే చాలా తక్కువని పేర్కొన్నారు.
ప్రస్తుతం వర్షాలు తగ్గుముఖం పట్టడంతో పెద్దగా ప్రమాదమేమీ లేదని, అయినప్పటికీ, అత్యంత అప్రమత్తంగా ఉన్నామని వెల్లడించారు.
రాయగడలో ఇంకా కొంత వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు.