లైవ్, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై అమిత్ షా ఏమన్నారంటే...
దేశ యువత మనోభావాలను మోదీ ప్రభుత్వం గౌరవిస్తుందని, ప్రశ్నాపత్రాల లీకేజ్‌ను అరికట్టడానికి అవసరమైన చర్యలు తీసుకోవడానికి కట్టుబడి ఉందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు. బీజేపీ కార్యకర్తలకు పదవి కన్నా దేశమే ముఖ్యమని అమిత్ షా వ్యాఖ్యానించారు.
సారాంశం
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై బీజేపీ సీనియర్ నేత మురళీమనోహర్ జోషీ స్పందించారు. ఆలస్యమైనప్పటికీ సరైన నిర్ణయం తీసుకున్నారని అన్నారు.
- డిమాండ్లన్నింటికీ ప్రభుత్వం అంగీకరించిందని నిరసనకారులంతా ఇళ్లకు తిరిగి వెళ్లాలని కాక్రోచ్ జనతాపార్టీ కోరింది.
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా యువత చేసిన పోరాటం, వారి త్యాగాల విజయమే అని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ అన్నారు.
లైవ్ కవరేజీ
జంతర్ మంతర్ దగ్గర ఇప్పుడు ఎలా ఉందంటే....

ఫొటో సోర్స్, ANI
ఫొటో క్యాప్షన్, ఖాళీగా కనిపిస్తున్న జంతర్ మంతర్ ప్రాంతం కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో దిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో సాగిన ఆందోళన శనివారం రాత్రి ముగిసింది.
నిరసనకారులు ఆ ప్రాంతాన్ని ఖాళీచేశారు. పోలీసుల మోహరింపు కొనసాగుతోంది.
అయితే ఇంతకుముందుతో పోలిస్తే ఇప్పుడు అక్కడ మోహరించిన పోలీసుల సంఖ్య బాగా తగ్గింది.
సముద్ర గర్భంలో దొరికిన 74 ఏళ్ల కిందటి విమాన ప్రమాద శకలాలు, నేటి సేఫ్టీ నిబంధనలకు ఈ యాక్సిడెంటే కారణమంటారు, ఎందుకంటే..
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు దారి తీసిన ఐదు కారణాలు ఇవేనా?
మనం మళ్లీ కలుస్తాం - ధర్మేంద్ర ప్రధాన్‌ను ఉద్దేశించి కొత్త విద్యాశాఖా మంత్రి ప్రహ్లాద్ జోషీ వ్యాఖ్యలు

ఫొటో సోర్స్, Sonu Mehta/Hindustan Times via Getty Images
ఫొటో క్యాప్షన్, ప్రహ్లాద్ జోషి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనంతరం కేంద్ర విద్యాశాఖ బాధ్యతలు తనకు అప్పగించడంపై ప్రధాని మోదీకి ప్రహ్లాద్ జోషి ధన్యవాదాలు చెప్పారు.
‘‘మోదీ ప్రభుత్వం గత పన్నెండేళ్లలో ఎన్నో చరిత్రత్మక విజయాలు సాధించింది. ప్రధాని మార్గదర్శకత్వంలో నా పూర్తి సామర్థ్యంతో పనిచేయడానికి ప్రయత్నిస్తా’’అని ప్రహ్లాద్ జోషి చెప్పారు.
‘‘ధర్మేంద్ర ప్రధాన్ రాజకీయ ప్రస్థానం అనేక దశాబ్దాలనుంచి సాగుతోంది. దేశాభివృద్ధి విషయంలో ఆయన నిబద్ధత ఎప్పటికీ గుర్తుండిపోతుంది. తన పదవీకాలంలో ధర్మేంద్ర ప్రధాన్ నూతన విద్యావిధానాన్ని విజయవంతంగా అమలుచేశారు. విద్యారంగంలో వందకు పైగా చిన్నా,పెద్దా సంస్కరణలు ప్రవేశపెట్టారు. జాతీయ ప్రయోజనాలకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ ఆయన పదవి నుంచి వైదొలిగినప్పటికీ, దేశాభివృద్ధికి ఆయన చేసిన సేవను అది మరుగునపడనివ్వదు. దేశ అభివృద్ధి మార్గంలో మనం మళ్లీ కలుస్తాం’’ అని ప్రహ్లాద్ జోషి ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు.
బీజేపీ కార్యకర్తలకు పదవి కన్నా దేశం ముఖ్యం: అమిత్ షా

ఫొటో సోర్స్, Debajyoti Chakraborty/NurPhoto via Getty Images
ఫొటో క్యాప్షన్, అమిత్ షా దేశ యువత మనోభావాలను మోదీ ప్రభుత్వం గౌరవిస్తుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. ప్రశ్నాపత్రాల లీకులను అరికట్టేందుకు అవసరమైన సంస్కరణలు తీసుకురావడానికి కేంద్రం కట్టుబడి ఉందని శనివారం రాత్రి అమిత్ షా ‘ఎక్స్’లో రాశారు.
బీజేపీ కార్యకర్తలకు పదవి కన్నా దేశం, యువత, విద్యార్థులే ముఖ్యమని, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా దీనికి నిదర్శనమని అమిత్ షా పోస్ట్ చేశారు.
ప్రశ్నాపత్రాల లీకేజ్‌కు బాధ్యులైనవారికి కఠిన శిక్ష పడేలా ప్రధాని మోదీ తీసుకున్న చర్యలు ప్రశంసనీయమని అమిత్ షా అన్నారు. ప్రధాని చర్యలు నీట్‌లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు సంపూర్ణ న్యాయం అందిస్తాయని తనకు నమ్మకముందని అమిత్ షా తెలిపారు.
‘‘తన పదవీకాలంలో ధర్మేంద్ర ప్రధాన్ జాతీయ విద్యావిధానాన్ని సమర్థవంతంగా అమలు చేయడం, మాతృభాషలో పరీక్షలు నిర్వహించడం, పీఎం శ్రీ పాఠశాలల విస్తరణ, డిజిటల్ విద్యను ప్రోత్సహించడం, నైపుణ్యాభివృద్ధి, పరిశ్రమ-విద్యాసంస్థల సమన్వయాన్ని బలోపేతం చేయడం వంటి అంశాల్లో కీలక సంస్కరణలు చేపట్టారు. పరీక్షా విధానాన్ని విద్యార్థి కేంద్రీకృతంగా, మరింత సమగ్రంగా తీర్చిదిద్దేందుకు ఆయన చేసిన కృషి ప్రశంసనీయం’’ అని అమిత్ షా తన పోస్టులో రాశారు.
బీబీసీ తెలుగు లైవ్ పేజ్‌కు స్వాగతం
నేను బీబీసీ ప్రతినిధి కమలాదేవి నల్లపనేని.
ఇప్పటి నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు ముఖ్యమైన వార్తలను లైవ్ పేజ్ ద్వారా మీకు అందిస్తాను.
నిన్నటి లైవ్ పేజ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
